ఔటర్ రింగ్ రోడ్డు పైనుంచి కిందపడిన కారు.. ఇద్దరి మృతి

  • మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
  • ప్రమాద సమయంలో కారులో ఐదుగురు 
  • ప్రమాదానికి గల కారణంపై పోలీసుల దర్యాప్తు
హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్‌రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఓఆర్ఆర్‌పై ప్రయాణిస్తున్న ఓ కారు నార్సింగి సమీపంలో అదుపుతప్పి కిందపడింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. 

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ముగ్గురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉన్నట్టు తెలిపారు. మృతులను గుర్తించాల్సి ఉందని పేర్కొన్నారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణంపై దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad ORR
Narsingi
Road Accident

More Telugu News